Pushpa 2: పుష్ప 2లో మెగాస్టార్.. పార్ట్ 1కు మించిన పార్ట్ 2 ప్లాన్..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం, సిరీస్ సినిమాల్లో భాగంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోడంతో 'పుష్ప 2' విషయంలో మేకర్స్ ప్లాన్ మారింది. ఈ సారి అంతకు మించి అనే స్థాయిలో పార్ట్ 2ని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ విషయంలోనూ రాజీపడకుండా మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే పుష్ప 2లో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా పుష్పరాజ్ యువసేన తిరుపతి అంటూ మెగాస్టార్ ఇంద్ర పోస్టర్‌పై బన్నీ ఉన్న ఓ కలౌట్ నెట్టింట వైరల్ అవుతూ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.