Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన!
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన ఆయన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, వీలైనంత త్వరగా అల్లు అర్జున్ను కలుస్తానని చెప్పాడు. రేవతి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు.
అల్లు అర్జున్ పై కేసు వెనక్కి.. శ్రీతేజ్ తండ్రి సంచలన ప్రెస్ మీట్!
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో సానుభూతితో కేసును వెనక్కు తీసుకుంటానన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు కోలుకోవడానికి నెల నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు.
Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. 2 గంటలపాటు బన్నీపై 50కిపైగా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. మరికొన్నింటికి మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాడట.
Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఓ రిపోర్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు. అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!
అల్లు అర్జున్ ను థియేటర్ కు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తాపత్రయ పడుతున్నారన్నారు. గురుకుల విద్యార్థుల మృతిపై సీఎం అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదన్నారు.
పోలీస్ స్టేషన్ లోపుష్ప రాజ్.! | Allu Arjun | RTV
పోలీస్ స్టేషన్ లోపుష్ప రాజ్.! | Tollywood Star and Pushpa 2 fame Allu Arjun makes his presence for the enquiry at Chikkadpally Police Station | RTV
అలా ఎందుకు చేశావ్.. అల్లు అర్జున్ ను అడుగుతున్న 50 ప్రశ్నల లిస్ట్ ఇదే!
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. లోపలికి ఎప్పుడు వెళ్లారు? పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు? మీరు వచ్చే విషయం ఫ్యాన్స్ కు ఎలా తెలిసింది? తదితర 50 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌పై రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు!
సంధ్య థియేటర్ ఘటనపై మృతురాలు రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదన్నారు. తమ వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్న విషయం తమకు నచ్చలేదన్నారు. రెండో రోజు నుంచే బన్నీ నుంచి తమకు మద్దతు లభించిందని తెలిపారు.