Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌కి ముందు టైం టు టైం జరిగింది ఇదే!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్న టైం నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచిన వరకు టైం టు టైం అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.
అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
KTR: బన్నీకి మద్ధతుగా కేటీఆర్.. పోస్ట్ వైరల్!
అల్లు అర్జున్ అరెస్టును కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బెడ్రూమ్లోంచి బలవంతంగా లాక్కొచ్చారు.. మీడియాతో బన్నీ!
సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్
సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పదేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది.