TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ కుమార్తెలు.!

తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

New Update
TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ కుమార్తెలు.!

Rajinikanth Daughters Visited Tirumala : తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య (Aishwarya), సౌందర్య (Soundarya) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించి, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఐశ్వర్య, సౌందర్య కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు.వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rajinikanth Daughters  Aishwarya Soundarya Visited TirumalaRajinikanth Daughters  Aishwarya Soundarya Visited Tirumalapublive-imageRajinikanth Daughters  Aishwarya Soundarya Visited Tirumala

ఇది కూడా చదవండి: ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.!

అటు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈమధ్యే గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవేన్ సాధించి లాభాల బాటలో ఉంది. దీంతో మూవీటీం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ ఆనందంలోనే విశ్వక్ సేన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ విశ్వక్ సేన్, చాందినిని చూసిన ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు