Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు మృతి..!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు. మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారు.