New Treatment for Diabetes: డయాబెటీస్ ట్రీట్‌మెంట్‌లో సరికొత్త ఆవిష్కరణ

డయాబెటీస్ ట్రీట్‌మెంట్‌లో సరికొత్త ఆవిష్కరణ చేశారు ఏఐజీ హాస్పటల్ వైద్యులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డివైజ్డ్ బేస్డ్ ఎండోస్కోపిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను బాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. డయాబెటీస్ తో పాటూ ఒబెసిటీని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.

New Update
New Treatment for Diabetes: డయాబెటీస్ ట్రీట్‌మెంట్‌లో సరికొత్త ఆవిష్కరణ

New Treatment for Diabetes: వైద్యరంగం రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ప్రతీ రోగానికీ కొత్త కొత్త మందులను, పద్ధతులనూ కనిపెడుతున్నారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మరీ చికిత్సను సులభతరం చేస్తున్నారు. తాజాగా డయాబెటీస్, ఒబెసిటీకి చికిత్సకు సంబంధించి ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు హైదరాబాద్ ఏఐజీ  వైద్యులు (Hyderabad AIG Hospitals). ప్రపంచంలోనే ఇది మొదటిది అని చెబుతున్నారు. డ్యుడెనో జెజునల్ బైపాస్ లైనర్ ఎండోస్కోపి (Duodeno jejunal bypass liner endoscopic) ట్రీట్మెంట్ అని దీనికి ఏరు పెట్టారు. ఇదొక డివైజ్ బేస్డ్ ఎండోస్కోపిక్ ట్రీట్ మెంట్ అని చెబుతున్నారు ఏఐజీ హాస్పటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి. దీని లైవ్ ప్రొసీజర్ ను చూపించారు. చిన్న ప్రేగులో ఒక చిన్న పరికరాన్ని అమరుస్తారు. అది శరీరంలోని న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను సరిగ్గా ఉండేలా చూస్తుంది. దీని ద్వారా డయాబెటీస్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా ఒబెసిటీని కూడా నియంత్రిస్తుంది అని చెబుతున్నారు.

Also Read:చంద్రబాబు విడుదల ఎప్పుడంటే.. సంచలన విషయాలు చెప్పిన లాయర్

చిన్న ప్రేగులో ఉన్న డివైజ్ సుగర్ లెవల్స్‌ను 1.5-2 శాతం వరకూ ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పాటూ ఆపరేషన్లు లేకుండా, శరీరం మీద గాటు పడకుండా వెయిట్ రిడక్షన్ చేయవచ్చని చెబుతున్నారు సెంటర్ ఫర్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ థెరపీ డాక్టర్ రాకేష్ కాల్పల. ఈ ట్రీట్‌మెంట్‌ను ఏఐజీ హాస్పటల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ డయాబెటిక్ అండ్ మెటబాలిక్ సమ్మిట్ లో ప్రవేశపెట్టారు. ఒబెసిటీ వల్ల కార్డియాక్, లివర్, నిద్రకు సంబంధించిన రోగాలు లాంటివి వస్తాయి. వాటన్నింటినీ రాకుండా ఈ డివైజ్ కాపాడుతుందని చెబుతున్నారు డా. నాగేశ్వర్ రెడ్డి. ఈ ట్రీట్‌మెంట్‌ను తాము 26 మంది పేషెంట్ల మీద టెస్ట్ చేసి చూశామని...అందరిలోనూ సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.

Also read:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు