Accident: నల్లమల్ల ఘాట్‌లో ఘోర ప్రమాదం.. డ్రైవర్ మృతి కర్నూలు జిల్లా నల్లమల్ల ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండ చరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్ వెంకటేశ్వరరావు గాయపడ్డారు. By Vijaya Nimma 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Accident: కర్నూలు జిల్లా నల్లమల్ల ఘాట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఏలూరుకు చెందిన క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ వాహనం కర్నూలు వస్తుండగా నంద్యాల, గిద్దలూరు ఘాట్‌రోడ్డు సమీపంలోని బొగద పాత వంతెన దగ్గర బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండ చరియను ఢీకొట్టింది. దీంతో ఏలూరు కొత్తగూడెం సెంటర్‌కు చెందిన డ్రైవర్ పెద్దరాజు(39) ప్రాణాలు కాపాడుకునేందుకు వాహనం నుంచి కిందకు దూకడంతో కొండచరియ రాళ్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. లారీలోనే ఉన్న క్లీనర్ వెంకటేశ్వరరావు కూడా ఘటనలో గాయపడ్డారు. ఇద్దరినీ రోడ్ సేఫ్టీ కానిస్టేబుల్ రసూల్ 108కి సమాచారం ఇచ్చి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ పెద్దరాజు మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులే లేని ఐదు దేశాలు..అక్కడికి మరి ఎలా వెళ్తారు..? #accident #nallamalla-ghat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి