Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పూణెలోని దిగవాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ వాసులుగా గుర్తించారు.
పూణెలోని దిగవాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ వాసులుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.
కర్ణాటకలోని హవేరిలో ముందు వెళ్తున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు.
సిమ్లాలోని జుబ్బల్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు.
మహారాష్ట్రలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అక్కడి వారిని విషాదంలో ముంచేసింది. కొండనై నుంచి కారు రివర్స్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి ఓ అమ్మాయి మరణించింది. దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణీకులతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షిని ఢీకొట్టింది. ఆ తరువాత విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్‌లోని విమానాశ్రయంలో దించారు.
ఉత్తరాఖండ్ లోయలో పడి చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తామని చెప్పారు.
ఝార్ఖండ్ లాతేహర్లో ససారాం- రాంచీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరవడంతో రైలులోని వారు కిందకి దిగి పరుగులు పెట్టారు. దీంతో పక్క ట్రాక్ లో వస్తున్న గూడ్స్ ఢీకొట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ యూసఫ్ గూడలో ఇంటర్ విద్యార్థిని ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయింది. మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెహరీన్ అనే యువతి కాలుజారీ పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.