Kejriwal: కేజ్రీవాల్ తో భార్య ములాఖత్ రద్దు!
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది.
కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిన్న బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట శ్రీనివాస్ కేజ్రీవాల్ పేరు చెప్పాడని..అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు.
తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ మంత్రి అతిషి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు తెలిపారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాబోతున్నారా? వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం ఆమెను కలిసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు వారి నివాసానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన పేరు కపిల్ రాజ్. కపిల్ రాజ్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లోని రాంచీ జోన్‌కు అధిపతి. గత సెప్టెంబర్ నెలలో ED అదనపు డైరెక్టర్ అయ్యారు.