Pawan Kalyan: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో యావత్ దేశం చూపు మొత్తం పిఠాపురం నియోజకవర్గం మీద ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ సారి పిఠాపురం నియోజకవర్గంలో నిలిచింది జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఆయనకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత నిలిచిన సంగతి తెలిసిందే.
ఈసారి ఎలాగైనా సరే పవన్ ని గెలిపించుకోవాలనే సంకల్పంతో సినీ ప్రముఖులు చాలా మంది పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. పవన్ ఊహించని రీతిలో అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో గెలిచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన పిఠాపురం అభివృద్ది పై దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే పవన్ ప్రత్యర్థి వంగా గీత రాజకీయ విమర్శలకు రెడీ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ…కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని వంగా గీత ఆరోపించారు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీ నేత వర్మ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఎమ్మెల్సీ పదవీ ముఖ్యం కాదని తెల్చిచెప్పారు. ఇప్పటికే పిఠాపురానికి పురుషోత్తం పట్నం నుంచి నీళ్లను విడుదల చేసినట్లు వివరించారు. పవన్ పిఠాపురం అభివృద్దికి తోడ్పడే హామీలకు కట్టుబడి ఉన్నట్లు జనసేన ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు పవన్ ఇక్కడ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.