Pithapuram: వంగా గీత @ ఏపీ డిప్యూటి సీఎం: జగన్‌!

పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ ను గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ కల్యాణ్‌ ను గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Pithapuram: వంగా గీత @ ఏపీ డిప్యూటి సీఎం: జగన్‌!

CM Jagan Offers Deputy CM To Vanga Geetha: ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ ను గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

గెలిచినా ఓడినా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు.. కానీ, ఇక్కడ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వంగా గీతనే అని తెలిపారు. పిఠాపురం అభివృద్ధి గీతతోనే సాధ్యమని తెలిపారు. ఐదోళ్లకోసారి కార్లు మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను మార్చుతారని విమర్శిచారు. ఇలాంటి వ్యక్తిని నమ్మి మహిళలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఒకసారి చేస్తే పొరపాటు.. రెండోసారి చేస్తే గ్రహపాటు.. మూడోసారి చేస్తే అది అలవాటు అని తీవ్ర విమర్శలు చేశారు.

కాగా, కాసేపట్లో ప్రచారం ముగియనుండగా.. ఫైనల్ టచ్ ఇచ్చేందుకు జగన్ పిఠాపురంలో పర్యటించారు. మొత్తం ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12.30కు కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తరపున ప్రచారంలో, చివరగా మధ్యాహ్నం 3 గంటల నుంచి పిఠాపురంలో ప్రచారం చేసి అక్కడే ముగించారు.

Also read: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు!

#pitapuram #vanga-geetha #ycp #ap-cm-jagan
Advertisment
తాజా కథనాలు