Vande Bharat: మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు పలు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం- సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు అదనంగా మరో స్టాప్ ని చేర్చారు.
ఈ వందేభారత్ రైలు ఇకపై ఏలూరులోనూ ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఇక నుంచి ప్రయాణం సులభతరం కానుంది.
సికింద్రాబాద్ లో ఉదయం 5.05 గంటలకు బయల్దేరే ఈ వందేభారత్ రైలు ఏలూరుకు 9.49 గంటలకు చేరుకుంటుంది. అటు, అటు, విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరే వందేభారత్ రైలు ఏలూరుకు సాయంత్రం 5.54 గంటలకు వస్తుంది. ఆగస్టు 25 నుంచి వందేభారత్ రైలుకు ఏలూరు స్టాపింగ్ అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.