Nitin Gadkari: టూ వీలర్ వాహనదారుల రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని, అందరికీ హెల్మెట్ పై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలోనే టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అందుబాటు ధరలో హెల్మెట్లు అందించేలా చూడాలన్నారు. వాహనదారుల ప్రాణాలను కాపాడాలని, 2022లో 30వేలమంది బైకర్స్ హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు.