Nitin Gadkari: టూ వీలర్ వాహనదారుల రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని, అందరికీ హెల్మెట్ పై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలోనే టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అందుబాటు ధరలో హెల్మెట్లు అందించేలా చూడాలన్నారు. వాహనదారుల ప్రాణాలను కాపాడాలని, 2022లో 30వేలమంది బైకర్స్ హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Two Wheeler: టూ వీలర్ కొనేవారికి గుడ్ న్యూస్.. దానిపై భారీ డిస్కౌంట్!
హెల్మెట్ లేకపోవడంతోనే చాలామంది టూ వీలర్ వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. దీంతో టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. 2022లో 30వేలమంది హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు.
Translate this News: