Kalki 2898 AD: పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ప్రబాస్ హీరోగా వస్తున్న ఈ మూవీలో పెద్ద స్టార్స్ అందరూ నటిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. మే9న విబడుదల కానున్న కల్కి మొదటి పార్ట్ ప్రమోషన్స్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ మొదలుపెట్టారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు కల్కి 2898 ఏడీగా ఎందుకు పెట్టామో వివరించారు.
అప్పుడు మొదలై ఫ్యూచర్లో ముగుస్తుంది…
తాను చిన్నప్పటి నుంచీ మహాభారతం గురించి వింటూ…స్టార్ వార్స్‌ని చూస్తూ పెరిగానని…దానినే సినిమాగా తీయాలనుకున్నాని చెప్పారు నాగ్ అశ్విన్. కల్కి మూవీ మహాభారత కాలంలో మొదలై 2898తో ముగుస్తుంది అని చెబుతున్నారు. గతంలో ప్రారంభమై భవిష్యత్తులో ముగస్తుంది కాబట్టే దీనికి కల్కి 2898ఏడీ అని పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. మొత్తం సినిమాలో ఆరువేల ఏళ్ళ మధ్య జరిగే కథను చూపించబోతున్నామని తెలిపారు. గతంలో ప్రపంచం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉండో మనకు తెలుసు. కానీ ఇందులో మేం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నాం. ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించాము దాని కోసం అంటూ కథ గురించి హింట్ ఇచ్చారు నాగ్ అశ్విన్. సినిమాలె ప్రధాన పాత్రలన్నీ మైథాలజీ చుట్టూనే తిరుగుతాయని చెప్పారు.
కథ గురించి గాసిప్స్…
నాగ్ అశ్విన్ టైటిల్ వెనుక ఉన్న రహస్యం చెప్పడంతో ఇప్పుడు మూవీ మొత్తం కథ గురించి గాసిప్స్ మొదలయ్యాయి. విలన్ కలి కమల్ హాసన్ ఈ ప్రపంచాన్ని తన అధీనంలోకి తీసుకొని ప్రజలని హింసిస్తూ అంధకారంలో బందీలుగా చేస్తాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా కల్కిగా ప్రభాస్ అవతరిస్తాడు. అతను అశ్వథామ (అమితాబచ్చన్) ని కలిసి అతనికి శాప విమోచనం కలిగించి.. ఈ ప్రపంచానికి కాపాడటం కోసం సాయం కోరతాడు. ఆ తరువాత ఈ విశ్వంలో ఉన్న ఆరుగురు చిరంజీవులతో కలిసి కలితో పోరాటం చేస్తాడు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే కలి కొడుకుగా నెగిటివ్ షేడ్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. పార్ట్ 1 క్లైమాక్స్ లో నిజమైన కలిపురుషుడు విలన్ ప్రభాస్ అని రివీల్ అవుతుంది. పార్ట్ 2లో కల్కి అవతారంలో ప్రభాస్ కలిపురుషుడు అయిన ప్రభాస్ ని ఎదుర్కొంటాడు. ఫైనల్ గా ఈ విశ్వాన్ని వారి నుంచి కాపాడి ధర్మస్థాపన చేయడంతో కథ ముగుస్తుందంట. ఇదీ కల్కి కథ గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం. అయితే దర్శకుడు, ఇందులో నటిస్తున్న నటులు కానీ ఎవ్వరూ ఇదీ కథ అని ఇప్పటివరకూ ఎక్కడా రివీల్ చేయలేదు.
Also Read:Virat Kohli Daughter: లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ…వైరల్ అవుతున్న ఫోటో