Slippers On Convoy : ప్రధాని మోదీ (PM Modi) పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు పోలీసులు పహారా కాస్తూనే ఉంటారు. భారత ప్రధాని సెక్యూరిటీ బాధ్యత మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)దే. ప్రధాని భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించేందుకు బ్లూ బుక్ అనే ఓ రూల్ బుక్ ఉంటుంది. ఈ బ్లూ బుక్ ఆదేశాలు, సూచనలను కేంద్ర హోంశాఖ జారీ చేస్తుంది. ప్రధాని వెళ్లడానికి మూడు రోజుల ముందే ఎస్పీజీ.. ఆ ఏరియాలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) అధికారులతోపాటు సంబంధిత రాష్ట్రం, అక్కడి పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లతో భద్రతపై సమీక్షిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టం కూడా ఉంది. ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఎస్పీజీ అవసరం అనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించడం తప్పనిసరి.
అయితే ఇలాంటి భద్రత కూడా ఒక్కోసారి వైఫల్యానికి గురవుతోంది. గతంలో పంజాబ్ పర్యటన (Punjab Tour) కు ప్రధాని మోదీ వెళ్ళినప్పుడు 20 నిమిషాల పాటూ ఆయన కాన్వాయ్ నడిరోడ్డు మీద ఆగిపోయింది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఇది జరిగింది. ఇప్పుడు తాజాగా వారణాసి (Varanasi) లో ప్రధాని భద్రతలో వైఫల్యం బయటపడింది. మంగళవారం వారణాసి పర్యటనకు వెళ్ళారు మోదీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి మోదీ వారణాసి వెళ్ళారు. అక్కడ ప్రజలను కలిశారు, గంగాహారతిలో పాల్గొన్నారు. అంతా బాగానే జరిగింది కానీ… తిరిగి వెళుతున్న సమయంలో మోదీ కాన్వాయ్ మీద కొంతమంది చెప్పులు విసిరారు. అయితే వీటిని ఎవరు విసిరారు, ఎందుకు ఈ పని చేశారు లాంటివి ఏమీ తెలియలేదు. దీనికి బాధ్యలయినవారిని అరెస్ట్ చేశారా అన్న విషయం మీద కూడా స్పష్టత రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Security breach ! Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi has surfaced..#NarendraModi #Varanasi #SecurityBreach #PMModi pic.twitter.com/JAQnUqxZL3
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) June 19, 2024
Slipper thrown at PM Modi’s bulletproof car in Varanasi. Isn’t this a massive security breach? pic.twitter.com/mO6tao7Vh5
— Vijaita Singh (@vijaita) June 19, 2024
Also Read: Big Breaking: కేంద్ర కేబినేట్లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర