/rtv/media/media_files/2025/04/18/JMvlgm6ZGVrMuBavPK9E.jpg)
temple-slippers
మనం ఎక్కడికైనా గుడికి వెళ్తే గుడి ముందుగా చెప్పులు వదిలేసి ఆలయం లోపలికి వెళ్తాం. అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి కొన్నిసార్లు చెప్పులు కనిపించవు.. ఎక్కాడా చూసిన కనిపించవు.. దీంతో ఇలా జరిగిందేంటీ అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా బాధపడాల్సిన అవసరం లేదు. అవును బాధపడకుండా పైగా సంతోషించండి.. ఇది మీ జీవితంలో జరగబోయే శుభాలకు సంకేతంగా భావించవచ్చు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పొచ్చు. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయట. దేవాలయాల వద్ద చెప్పులు దొంగతనానికి గురైతే అప్పటివరకు వారికి ఉన్న అప్పుల బాధ నుండి బయటపడుతారని, పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగాశనివారం రోజున దేవాలయాల వద్ద చెప్పులు పోతే మరింత మంచిదని చెబుతున్నారు. శనివారం నాడు ఆలయం వద్ద చెప్పులు దొంగిలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతాయట.
వేరేవాళ్ల చెప్పులు వేసుకోని
అయితే ఆలయాల వద్ద చెప్పులు పోతే వేరేవాళ్ల చెప్పులు వేసుకోని రావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శని ఎప్పుడు కాళ్ల వద్దే ఉంటుంది. అలా వేరేవాళ్ల చెప్పులు వేసుకుంటే వారికున్న ప్రతికూల ప్రభావాలు మీకు దరిచేరుతుందట. మనిషి జాతకంలో శని వక్ర దృష్టి ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు అస్సలు జరగవు.. అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా దొంగతనం చేస్తే, లేదా మనమే చెప్పులు వదిలేస్తే కచ్చితంగా కష్టాలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే చెప్పులు పోయాయని అక్కడే ఏదైనా షాపులో చెప్పులు కొనుక్కోవడం కూడా మంచిది కాదట.. తిరిగి ఇంటికి చేరుకున్నాక మరుసటి రోజు తరువాత ఎప్పుడైనా కొత్త చెప్పులు కొనుక్కోవడం శుభప్రదం.