Tennis Star Sania Mirza : టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై భారత క్రికెటర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వార్తలను షేర్ చేసేటప్పుడు సోషల్ మీడియా యూజర్స్ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించాడు. ఈ మేరకు కొన్ని మీమ్స్ సరదాగా ఉన్నప్పటికీ చాలామందిని బాధపెడతాయని చెప్పాడు.
Shami bhai roasted Pakistan 😆 pic.twitter.com/yqiuIqdhoA
— Johns (@JohnyBravo183) July 19, 2024
అప్పుడు సరైన సమాధానం ఇస్తా..
‘ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి నాదొక రిక్వెస్ట్. మీరు క్రియేట్ చేసే మీమ్స్ (Memes) వల్ల చాలామంది బాధపడతారు. కొందరిని టార్గెట్ చేసుకొని ఇలాంటివి చేయడం బాధాకరం. అలా చేయడం వల్ల మీకు ఏం వస్తుంది? నేను ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే కనబడుతున్నాయి. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ఏదైనా వార్త షేర్ చేస్తున్నపుడు సరైనదా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ప్రచారం చేయాలనుకుంటే మీ వెరిఫైడ్ ఖాతాల నుంచి పోస్టు చేయండి. అప్పుడు నేను సరైన సమాధానం ఇస్తా. జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నించండి. ఇతరులకు సాయం చేయండి. ఉన్నతస్థాయికి వెళ్లేందుకు కృషి చేయండి. అప్పుడే మీరు మంచి వ్యక్తి అని ఇతరులు భావిస్తారు. అలాంటివన్నీ వదిలేసి ఇలాంటి చెత్త వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదు’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
View this post on Instagram
Also Read : ముఖంపై గడ్డం కనిపించిన వెంటనే భయం మొదలవుతుంది.. కారణం ఇదే!