Ayodhya: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు!
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
హైదరాబాద్లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, దిల్సుఖ్నగర్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది.
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గత నాలుగు రోజులుగా ఉక్కబోత, ఎండవేడి తో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.
రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.