PM Modi Ayodhya Tour : ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య(Ayodhya) లో అంతర్జాతీయ విమానా శ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతాదళాలు భారీగా మోహరించాయి. అయోధ్యలో నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానా శ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఒకేసారి 600 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించవచ్చు. ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం'(Ayodhya Dham) అనే పేరుని ఈ విమానాశ్రయానికి ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషో త్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరు ఉండేది. అలాగే అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ కు ‘అయోధ్య రామ్ జంక్షన్’గా పిలువనున్నారు.
ALSO READ: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?
ప్రధాని మోదీ పర్యటన వివరాలు..
ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం 10.45కు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అయోధ్య రైల్వేస్టేషన్‌ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల తరువాత విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో ప్రసంగిస్తారు. దాదాపు లక్ష మంది ఈ సభకు హాజరయ్యే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ బహిరంగ కార్యక్రమంలో, ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, ఉత్తర ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. వీటిలో గోసైన్ కి బజార్ బైపాస్-వారణాసి (ఘఘ్రా వంతెన-వారణాసి) (NH-233) యొక్క నాలుగు-లేన్ల విస్తరణ; NH-730లోని ఖుతార్‌ని లఖింపూర్ సెక్షన్‌గా బలోపేతం చేయడం, అమేథి జిల్లా త్రిశుండిలో LPG ప్లాంట్ సామర్థ్యం పెంపు, కాన్పూర్‌లో 130 MLD మురుగునీటి శుద్ధి కర్మాగారం కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పీఎంఓ తెలిపింది.
ALSO READ: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!