New Zealand : T20 క్రికెట్ ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) లో న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో గెలిచింది. దీంతో టోర్నమెంట్ లో న్యూజిలాండ్ ప్రస్థానం ముగిసింది. ట్రినిడాడ్‌లో జరిగిన ఈ గ్రూప్-సి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినియా(PNG)పై విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయానికి స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కీలకంగా నిలిచాడు. ఆటను 4 ఓవర్లలో మొత్తం నాలుగు మెయిడిన్లు బౌలింగ్ చేసి T20 ప్రపంచకప్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, ఆ జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) కూడా విజయంతో వీడ్కోలు పలికాడు. ఇది అతనికి చివరి ప్రపంచ కప్. ఈసారి కూడా PNG గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుండి బయటకు వెళ్లాయి. అయితే, న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ ముఖ్యమైనది. కనీసం పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఎదురుకుంది. ఎందుకంటే న్యూజిలాండ్ మొదటి 3 మ్యాచ్‌లలో రెండింటిలో ఓడి సూపర్-8 రేసు నుండి నిష్క్రమించింది. అయితే PNG తన చివరి మ్యాచ్‌లో అద్భుతం చేస్తుందని అనుకున్నా అలా జరగలేదు.
T20 World Cup 2024 : ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పీఎన్జీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఊహించిన విధంగా, PNG అనుభవం లేని బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బలమైన బౌలింగ్‌కు ఎదురుగా నిలబడలేకపోయారు, అయితే దీనికి ప్రధాన కారణం లాకీ ఫెర్గూసన్ అద్భుతమైన బౌలింగ్. స్టార్మీ పేసర్ లాకీ 4 ఓవర్ల స్పెల్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు ఓవర్లను మెయిడిన్లుగా వేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. ఇది 100 పరుగులు దాటాలనే PNG ఆశలను నాశనం చేసింది. ఇలా ఒక బౌలర్ మొత్తం నాలుగు ఓవర్లను మెయిడిన్లుగా బౌలింగ్ చేయడం T20 ఇంటర్నేషనల్‌లో ఇది రెండోసారి – ప్రపంచకప్‌లో మొదటిసారి. పిఎన్‌జిలో అతిపెద్ద స్కోరు 17 పరుగులు, దీనిని చార్లెస్ అమిని స్కోర్ చేశాడు. లాకీతో పాటు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ కూడా 2-2 వికెట్లు తీశారు.
ఈ లక్ష్యం న్యూజిలాండ్‌కు పెద్ద కష్టమైనది కాదు. జట్టు ఈ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తుందని అంచనా వేశారు. కానీ, PNG దానిని అంత సులభం కానివ్వలేదు. గత మూడు మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్ ఫిన్ అలెన్ తొలి ఓవర్లోనే ఔట్ కాగా, ఐదో ఓవర్లో రచిన్ రవీంద్ర కూడా ఔట్ అయ్యాడు. అప్పుడు డెవాన్ కాన్వే-కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. చివరగా డారిల్ మిచెల్ వచ్చి కొన్ని భారీ షాట్లు కొట్టి 13వ ఓవర్లో మ్యాచ్‌ను ముగించాడు.
Also Read : చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై అతికష్టంగా గెలిచిన పాకిస్థాన్!