Chandrayaan-3: చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థిలో కూడా పని చేస్తున్నాయని…లోకేషన్లన గుర్తిస్తున్నాయని ధ్రువీకరించారు ఇస్రా శాస్త్రవేత్తలు. నిన్న బెంగళూరులో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 12 నుంచి లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే(ఎల్ఆర్ఏ) నుంచి తమకు సంకేతాలు అందాయని చెప్పారు. చంద్రయాన్‌లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చామని అందులో నాసాకు (Nasa) చెందిన ఎల్ఆర్ఏ నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపారు. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. చంద్రయాన్ నుంచి తూర్పు వైపునకు ఉన్న ఎల్ఆర్ఏలోని లేజర్ అల్టిమీటర్…చంద్రయాన్ ఉన్న ప్రాంతం పరిస్థితులు ఎప్పటికప్పుడు అందిచగలుగుతోంది. ఇందులోని 8 పలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయిని చెప్పారు. దాదాపు 20 గ్రాముల బరువండే ఈ పరికరం పదేళ్ళ పాటూ చంద్రుని మీద మనుగ సాగించగదని అంటున్నారు.
Also Read:ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామమందిరం..ఎక్కడో తెలుసా..
గత ఏడాది సెప్టెంబర్‌లో స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిన చంద్రయాన్-3
ఆగస్టులో చంద్రయాన్‌ను (Chandrayaan) సక్సెస్ ఫుల్‌గా చంద్రుని మీద దింపారు. కొన్ని రోజులు చాలా బాగా పని చేసింది కూడా. ఆ తరువాత సెప్టెంబర్ ౩౦న సూర్యకాంతి చంద్రుడి ఉపరితం నుంచి తగ్గుముఖం పట్టింది. దీంతో చంద్రయాన్ నిద్రాణ స్థితిలోకి జారుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3 ల్యాండర్, రోవర్‌ను తిరిగి పునరుద్ధరించగలరని ఆశించారు. ఇది సురక్షితంగా పార్క్ చేసి ఉంది. స్లీప్ మోడ్‌లో సెట్ చేసి ఉంది. ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్లు ఆఫ్ అయ్యాయి. ప్రస్తుతం బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయింది. ప్రజ్ఞాన్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యాయని, రిసీవర్ ఆన్ లో ఉందని సమాచారం. చంద్రునిపై సూర్యోదయం కాగానే సూర్యరశ్మి అందేలా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.
అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా రోవర్ , ల్యాండర్ మేల్కొనలేదు. చంద్రయాన్-3 నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 20న సూర్యుడు మళ్లీ చంద్రుడిపై ఉదయించాడు. మొదటి మూడు రోజులు – సెప్టెంబర్ 22 వరకు – విక్రమ్ ల్యాండర్ (Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) పునరుద్ధరించడానికి బెస్ట్ టైమ్. ల్యాండర్, రోవర్ మేల్కొనడానికి చివరి ఎర్త్ డే వరకు వేచి చూస్తామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు. ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు చంద్రుడి విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితమయ్యాయి. చంద్రుడి మీద ధ్రువాలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. అంతేకాకుండా చంద్రుడిపై పూర్తిగా చీకటి పడటంతో చంద్రయాన్-3లోని సోలార్ ప్యానెల్స్ కూడా నిరుపయోగంగా మారాయి. రోవర్, ల్యాండర్లలో సాధారణంగా చంద్రుడిపైకి వెళ్లే హీటర్లు లేకపోవడంతో అవి నిద్రాణ స్థితిలోనే ఉండిపోయాయి.