Kannada Star Sudeep Reacts On Darshan’s Arrest : కన్నడ అగ్ర హీరో దర్శన్ (Darshan) ఇటీవల ఓ మర్డర్ కేసు (Murder Case) లో అరెస్ట్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి అనే అభిమానిని చంపాడనే ఆరోపణలతో దర్శన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇలాంటి తరుణంలో దర్శన్ అరెస్ట్ పై కన్నడ స్టార్ హీరో సుదీప్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మాకు అంతే తెలుసు…
దర్శన్ అరెస్ట్ పై సుదీప్ (Sudeep) మాట్లాడుతూ..” మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి’ అని అన్నాడు.
Also Read : మహేష్, బన్నీ బాటలో నితిన్.. ఫస్ట్ టైం ఆ బిజినెస్ లోకి..?
న్యాయం జరగాలి…
“దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) పై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది” అంటూ సుదీప్ వెల్లడించారు. సుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.