TDP Somi Reddy : వైసీపీ (YCP) మంత్రి కాకాణిపై మాజీ మంత్రి సోమిరెడ్డి (Somi Reddy) ఫైర్ అయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) లో కాకాణి ఉండే కారు దొరికినా తనది కాదని చెబుతున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి (Kakani) అని ఆరోపించారు. కాకాణి కల్తీ మద్యం కింగ్ అని, నకిలీ పత్రాలు చేయడంతో నెం. 1 అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్ బొల్లారంలో విషాదం.. స్కూటీపై భార్యాభర్తలు వెళ్తుండగా..
రేవ్ పార్టీతో తనకు సంబంధం లేనప్పుడు అక్కడ తన కారు స్టిక్కర్, పాస్ పోర్టు ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్, స్మగ్లింగ్ వాటితో కాకాణికి సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రపై ఒక పుస్తకం రాయవచ్చునని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..