ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలో సంక్షోభం, అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారం.. ఇలా మొత్తం నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైసీపీ హయాంలో వీటన్నంటిపై అక్రమాలు, దోపిడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అసలు శ్వేతపత్రాల్లో ఎలాంటి విషయాలు చంద్రబాబు వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలవరంపై శ్వేతపత్రం
రాష్ట్ర విభజన జరిగిన నష్టం కంటే వైసీపీ హయాంలో జరిగిన నష్టమే ఎక్కువని ఈ శ్వేతపత్రంలో వివరించారు. పోలవరానికి సంబంధించి రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.11,762 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో కేంద్రం వాటా రూ.6,764.16 కోట్లు. మిగతా నిధుల చెల్లింపుల్లో ఆలస్యం చేసింది. చివరికి మొత్తంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కోసం రూ.8,382.11 కోట్లు వచ్చాయి. కానీ ఇందులో వైసీపీ సర్కార్ కేవలం రూ.4,996.53 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేసి.. మిగిలిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను వేరే అవసరాలకు దారి మళ్లించారు. దీనివల్లే ప్రాజెక్టు పనుల్లో నిధులకు కొరత ఏర్పడింది.
2024 మే 31 నాటికి మొత్తం రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులపై కూడా ప్రభావం చూపింది. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏజెన్సీలన్నీ కూడా పనులు నిలిపివేసినట్లు శ్వేతపత్రం వివరించింది. అలాగే ఎగువ కాపర్ డ్యామ్‌లో గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్ల 2020లో వరదల వల్ల దిగువ ఉన్న డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఇప్పుడు కొత్త వాల్ నిర్మాణానికి రూ.970 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో వివరించారు.
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. pic.twitter.com/tpA7oXgIA5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 28, 2024
అమరావతిపై శ్వేతపత్రం
మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అమరావతిలో పనులు నిలిపివేశారు. దీంతో రూ.1,269 కోట్ల బకాయిలు మిగిలాయి. 1,917 ఎకరాల భూకసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 2,903 మంది రైతులకు యాన్యుటీని రద్దు చేశారు. 4,442 మంది రైతులకు సంక్షేమ పింఛన్లను రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వంపై రైతులు 1630 రోజుల వరకు ఆందోళనలు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 300 మిలియన్ డాలర్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1000 కోట్లను అడ్డుకుంది.
2014-19లో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం ఆవిష్కరించిన అమరావతి ప్రణాళికల ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయం రూ.51,687 కోట్లుగా నిర్ణయించబడింది. ఇందులో సిటీ-లెవల్ రోడ్స్ యుటిలిటీస్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన టైర్-1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.19,769 కోట్లు, ఇక టైర్-II మౌలిక సదుపాయాల కోసం రూ.17,910 కోట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌కు రూ.14,008 కోట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.41,170 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ.4,318 కోట్లు చెల్లించగా, నేటికి రూ.1,268 కోట్లు చెల్లించాల్సి ఉంది. అమరావతిని సకాలంలో నిర్మించడాన్ని ‘కోల్పోయిన అవకాశంగా’ సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో వివరించారు.
ఒక్క ఛాన్స్‌తో సీఎం అయిన జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో జనాన్ని జలగలా పీల్చేశాడు. పంచభూతాల ద్వారా వేలకోట్లు దోచుకున్న బూచోడు జగన్.#EndOfYCP #AndhraPradesh pic.twitter.com/K6epkGGN3e
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2024
విద్యుత్ రంగంపై శ్వేతపత్రం
2019 నుంచి 2024 వరకు ప్రజలపై విపరీతంగా విద్యుత్ భారం పడింది. వినియోగదారులపై వైసీపీ ప్రభుత్వం రూ.32,166 కోట్ల భారం మోపింది. విద్యుత్ సంస్థల రుణాలు రూ.49,596 కోట్లకు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ రంగానికి రూ.47,741 కోట్లు నష్టం జరిగింది. ట్రూఅప్ చార్జీల పేరుతో అదనపు భారం మోపారు. గృహ వినియోగదారులపై 45 శాతం చార్జీలు పెంచేశారు. ఇలా పెంచడం వల్ల 1.53 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 50 యూనిట్లు వాడిన పేదల చార్జీలు కూడా 100 శాతం పెంచినట్లు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
విద్యుత్ రంగంలో గత ఐదేళ్ల లో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. pic.twitter.com/WTQo44dp5u
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 9, 2024
అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై శ్వేతపత్రం
2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయి. ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోచుకున్నారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారు. అనర్హులైన వారికి భూ కేటాయింపు చేశారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు కోట్లు విలువ చేసే భూములు కట్టబెట్టారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తిని ఫేక్ డాక్యుమెంట్లతో దోచుకున్నారు. తిరుపతిలో మఠం భూములకు సంబంధించి 70 ఎకరాల భూమిని 22 ఏలో పెట్టి దోచేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా కాజేశారు. ఇళ్ల పట్టాల ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు. నివాస యోగ్యం కానీ చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇసుక దందాలో రూ 9,750 కోట్లు దోపిడీ చేశారని చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో తెలిపారు.
ఇదిలాఉండగా.. కూటమి ప్రభుత్వం ఈ నాలుగు శ్వేతపత్రాల్లో జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టింది. అలాగే వీటిలో జరిగిన అక్రమాలపై.. మాజీ సీఎం జగన్‌తో పాటు ఇతర నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సీబీఐ కేసులో అరెస్టయిన జగన్.. మరోసారి అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల దోపిడీ, వైసీపీ నేతల భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. pic.twitter.com/wqsMeriOC0
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 15, 2024
ఇసుక దందాలో రూ 9,750 కోట్లు దోపిడీ చేశారు.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/CCrbx5Hmu2
— Telugu Desam Party (@JaiTDP) July 15, 2024