Delhi Police Viral Post : టీమిండియా (Team India) 17ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ జట్టు 11ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫి నెగ్గింది. 2013లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫి గెలిచిన టీమిండియా మళ్లీ ఇన్నాళ్లు ఓ ఐసీసీ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఇక 2007లో ధోనీ సారధ్యంలో టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచింది. ఇక 2014 నుంచి జరిగిన ఐసీసీ (ICC) ఈవెంట్లలో సెమీస్ లేదా ఫైనల్లో ఓడిపోవడం టీమిండియాలకు అలవాటుగా మారిందని అనేక విమర్శలు ఉన్నాయి. అయితే టీ20 వరల్డ్కప్ 2024 గెలుపుతో ఈ విమర్శలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. మరోవైపు భారత్ జట్టు విజయంపై సోషల్మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ఢిల్లీ పోలీసులు పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCup
Let’s be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say?
Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA
— Delhi Police (@DelhiPolice) June 29, 2024
ఢిల్లీ పోలీసులు ఏం ట్వీట్ చేశారంటే:
‘భారత్ మరో #T20WorldCup గెలవడానికి మేమంతా 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు (52,70,40,000 సెకన్లు) వేచి ఉన్నాము ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా కాస్త ఓపికగా ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి.. ఏమంటావ్? #టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు’ అని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.
ఇందులో చాలా మెసేజ్ ఉందంటున్నారు నెటిజన్లు. ఇటివలీ కాలంలో చాలామంది సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఉన్నా క్రాస్ చేస్తున్నారు. దీని వల్ల ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్న ఈ విషయంలో చాలామంది తీరు మారడంలేదు. అందుకే పోలీసులు క్రికెట్ స్టైల్లో ఈ ట్వీట్ చేయగా అది వైరల్గా మారింది.
Also Read : కేసీఆర్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు!