Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ అరెస్ట్
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు.