Assam CM Himanta Biswa Sarma Dance : దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ షురూ అయ్యింది. మొదటి విడత ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారం ఊపందుకుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధానపార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అసోంలో కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ఆ రాష్ట్ర సీఎం ప్రచారం చేపట్టారు. బీజేపీ (BJP) అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లను కోరుతూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు.
శనివారం జోర్హట్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని శివసాగర్ (Sivasagar) అసెంబ్లీ నియోజకవర్గంలో హిమాంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సభలో అబ్కీ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే బీజేపీ పాటకు సీఎం బిశ్వంత శర్మ డ్యాన్స్ తో అదరగొట్టారు. హుషారుగా స్టెప్పులేస్తూ సందడి చేశారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతూ వారిని మరింత ఉత్సహా పరిచారు. హిమంత బిశ్వ శర్మ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Assam CM Himanta Biswa Sarma dances with people during a public meeting in Sivasagar#LokSabhaElections2024 pic.twitter.com/nlzIAWFsW0
— ANI (@ANI) April 6, 2024
ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు షాక్..కస్టడీని పొడిగించిన కోర్టు..!