#WATCH | Gyanesh Kumar from Kerala and Sukhbir Singh Sandhu from Punjab selected as election commissioners, says Congress MP Adhir Ranjan Chowdhury. pic.twitter.com/FBF1q44yuG
— ANI (@ANI) March 14, 2024
–> ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి ఎంపిక బోర్డు సమావేశం జరిగింది. ఈ ప్యానెల్లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఎలక్షన్ కమీషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
–> మరోవైపు మార్చి 15 లేదా 16 తేదీల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
–> అంతకుముందు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లతో సహా ఎన్నికల సంఘంలోని ఉన్నతాధికారులను నియమించకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే!