New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది సీఈసీ. కేంద్ర ఎన్నికల నూతన కమిషనర్లుగా కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్ బీర్ సింగ్ సంధుల పేర్లను ప్రకటించింది.

New Update
New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం
New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది సీఈసీ. కేంద్ర ఎన్నికల నూతన కమిషనర్లుగా కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar), పంజాబ్‌కు చెందిన సుఖ్ బీర్ సింగ్ సంధుల (Sukbhbir Singh Sandhu) పేర్లను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు కమిషనర్లను హై పవర్డ్ కమిటీ ఎంపిక చేసింది.


--> ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి ఎంపిక బోర్డు సమావేశం జరిగింది. ఈ ప్యానెల్‌లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఎలక్షన్ కమీషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

--> మరోవైపు మార్చి 15 లేదా 16 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

-->  అంతకుముందు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లతో సహా ఎన్నికల సంఘంలోని ఉన్నతాధికారులను నియమించకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే!

Advertisment
Advertisment
తాజా కథనాలు