MLC’S: తెలంగాణలో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల స్థానాల నియామకానికి తలెత్తిన వివాదానికి ఎండ్ కార్డు పడింది. ఈరోజు ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసేన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన వారికి మంత్రులు అభినందనలు తెలిపారు.
కాగా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ తమిళిసై ప్రకటన చేశారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. వారి పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఎన్నికపై స్టే విధించింది. దీంతో గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు పెండింగ్ లో ఉండిపోయాయి.
సుప్రీం కోర్టు ఆదేశాలతో…
రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఇటీవల భారీ ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
దాసోజు తరఫున కపిల్ సిబల్ వాదించారు. వారి వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
Also Read : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 40 వేల మంది మృతి!