Fire Broke Out In Aakash Byjus : వైజాగ్(Vizag) లోని గాజువాక(Gajuwaka) లోని ఆకాష్ బైజూస్(Aakash Byjus) విద్యాసంస్థ మంటలు ఆహుతి అయిపోతోంది. బిల్డింగ్‌లోని ఏసీలో షార్ట్ స్క్యూట్(AC Short Circuit) జరగడంతో మంటలు చెలరేగాయి. మొదట్లో ఇవి చిన్నవిగానే ప్రారంభం అయ్యాయి. కానీ తర్వాత మంటలు భారీగా వ్యాపించాయి. ఏసీలో మంటలు క్రమంగా బిల్డింగ్ అంతా అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టూ ప్రజలు నివసించే అపార్ట్మెంట్లు ఉండడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
భారీగా ఆస్తి నష్టం..
అయితే ఆకాష్ బైజూస్ సంస్థ బిల్డింగ్‌లో అదృష్టవశాత్తు ఎవరూ లేరు. అందుకే మంటలు భారీగా అలుముకున్నా.. ప్రాణాపాయం ఏమీ జరగలేదు. కాకపోతే చాలా ఎక్కువగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక దశలో మంటలు అదుపులోకి వచ్చాయనుకున్నారు… అగ్నిమాపక సిబ్బంది కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే మంటలు అతి తొందరగా వ్యాపించాయి. బిల్డింగ్ మొదటి భాగం నుంచి వెనుక భాగానికి కూడా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Also Read : Telangana: చేవెళ్ళ కాదు.. సచివాలయంలోనే రెండు గ్యారంటీల ప్రారంభం