తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి అగ్రహీరోలు రూ.కోటి చొప్పున తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా రూ.2.5 లక్షలు విరాళం అందించారు. ఆ తర్వాత మిగతా హిరోయిన్లు విరాళాలు ఇవ్వడం లేదని పలువురు నెటిజన్లు విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా మరో కథానాయిక వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
Also Read: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్‌కి ఉన్న లింకేంటో తెలుసా?
మెగా డాటర్ కొణిదెల నిహరిక వరద బాధితుల కోసం రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ” నేను నగరంలో పుట్టినా.. మా పెద్దవారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. ఆ అనుభవాల వల్లే నాకు గ్రామీణ వాతావరణంపై అభిమానం ఉంది. డిప్యూటీ సీఎం మా బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో పాటు కుటుంబీకులు వరద బాధితులకు అండగా నిలబడడటం సంతోషం కలిగించింది. ఇందులో నేను పాలుపంచుకోవాలనుకుంటున్నానని” నిహారిక తెలిపారు.
Also Read: తండ్రైన టాలీవుడ్ హీరో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..