ఉద్యోగం చేస్తున్నావ్ కదా డబ్బులు లేవా.. బిజినెస్ చేస్తున్నావ్ కదా డబ్బులు అన్ని ఏం చేస్తున్నావ్.. డబ్బులు ఉంటే అప్పుగా ఇవ్వు.. వడ్డీతో కలిపి ఇస్తాను. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది ప్లీజ్ హెల్ప్ చేయండి. మళ్లీ జీతం రాగానే ఇస్తాను అంటూ ఇలా రకరకాల ఇబ్బందులు మనం చూస్తూనే ఉంటున్నాము. కొంతమంది డబ్బులుతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఉద్యోగం చేసినా జీవితాన్ని సంతోషంగా గడపలేకపోతున్నారు.
బతకడం ఎంత కష్టమో తెలుసా…!
మన జీవితం సాఫీగా చాగాలంటే డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ డబ్బు అనేది లేకపోతే బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యే. ఎంత ఉద్యోగం చేసి సంపాదించినా నెల వచ్చేసరికి మళ్లీ ఎవరో ఒకరి దగ్గర నుంచి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగం చేస్తున్నారు కదా.. మీకేం తక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ నెల రోజుల కష్టమంతా ఒక వారంలో అయిపోతుంది. ఈ విషయాన్ని ఎవరు ఊహించలేరు. ఒక్కొక్కసారి ఒక్కరోజులోనే అయిపోయే సందర్భాలు కూడా చాలా ఉంటాయి.
ఈ మధ్యకాలంలో ట్రెండింగ్.. ట్రెండింగ్
టెక్నాలజీ పెరిగింది.. జనాల్లో తెలివితేటలు కూడా బాగానే పెరిగాయి. ఉన్నవారా..లేనివారా…అనే తేడా లేకుండా జనాల్ని మోసం చేయటం చాలా ఈజీ అయిపోయింది. మంచి చెడులు ఆలోచించకుండా అందర్నీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. అంతేకాదు మంచితనంతోనే మోసం చేసేవాళ్లు ఎక్కువయ్యారు. చిట్టీలు, ఉద్యోగాల పేరుతో, అధిక వడ్డీల ఆశతో.. రకరకాలుగా ఈ మధ్యకాలంలో వంచన చేస్తున్నారు. కనీసం స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. మరి ఇంత దారుణంగా మోసపోతున్నాం కధ. మరి ఈ మోసాలటిన్ని అరికట్టడం ఎలా..? ‘డబ్బు తీసుకున్న వాడు సంతోషంగా జల్సాలు చేస్తుంటే’ . . ‘డబ్బు ఇచ్చిన వాడు మాత్రం చాలా మానసికంగా కుంగిపోతున్నాడు’. కొంతమంది అయితే ఎదుటివారి దగ్గర అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. వీరు మోసపోయి ఇబ్బందుల్లో పడిందే కాకుండా పక్కవారిని కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటికీ సొల్యూషన్ ఎలా దొరుకుతుంది మరి.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలంటే…
జరుగుతున్న విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకేముంది ఇంకోసారి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతవరకు సేఫ్ జోన్లో ఉండొచ్చు. అప్పు చేయాలని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. అంతే కాకుండా మనకి ఉన్న దాంట్లోనే జీవితాన్ని సంతోషంగా గడిపేలా చూసుకోవాలి. అప్పుడు శారీరకంగా, మానసికంగా కొంతైనా మనం ఆనందంగా ఉండొచ్చు. అనవసరంగా ఆశలకు పోయి జీవితంలోకి కష్టాలను కొని తెచ్చుకోకుండా ఉంటే మంచిది.