Encounter At Chhattisgarh: ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలం నంచి ఆయుధాలు మందుగుండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి.
encounter at Chhattisgarh
Maoists : భీకర కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Maoists Died : ఛత్తీస్గఢ్(Chhattisgarh) లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భీకర కాల్పులు(Fierce Firing) చోటుచేసుకున్నాయి. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతబలగాలకు, మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అవతలివైపు నుంచి కాల్పులు రావడం ఆగిపోవడంతో.. భద్రత బలగాలు వెళ్లి పరిశీలించగా వారికి ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి అంబటి రాయుడు! ట్వీట్ వైరల్..
అలాగే ఘటనాస్థలంలో మావోయిస్టు(Maoists) లకు సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. వాటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. బీజాపుర్ జిల్లాలోని బస్తర్ అనే ప్రాంతం లోక్సభ(Lok Sabha) నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న మొదటి విడతలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ-నక్సల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, మాయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.
Also Read : రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు
Maoist Vs Police: భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు మృతి!
Encounter At Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా? అనే అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వదలకుండా గాలిస్తున్నారు పోలీసులు.
ALSO READ: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, CRPF జవాన్లు ఉదయం 11 గంటలకు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు కాల్పులు చేశారని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులను మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను కూడా గుర్తించినట్లు తెలిపారు.
సోమవారం పోలీసులకు ఓ మావోయిస్టు లొంగిపోయాడు. ఆ మరుసటి రోజే ఈ ఎన్కౌంటర్ జరగడం ఎన్నో అనుమానాలకు దారి తీసింది. లొంగిపోయిన మావోయిస్ట్పై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇటీవల సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోగా.. ఆ తర్వాత ఆదివారం కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో మరో ముగ్గురు హతమైనట్లు పోలీసులు మీడియాకు వివరించారు. బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ చనిపోయాడని అన్నారు.
ఆదివారం రోజు ఉదయం కాంకేర్ జిల్లాలోలోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ , బీఎస్ఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా.. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్ తెలిపారు. సంఘటనా స్థలంలో ముగ్గురి మృతదేహాలతోపాటు 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ముగ్గురు మృతి చెందడంపై వారి కుటుంబ సభ్యులు మాత్రం వేరే వాదనను వినిపిస్తున్నారు. అసలు ఆ ముగ్గురు మావోయిస్టులే కాదని వారి కుటుంబాలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేసి.. సామాన్యులను కాల్చి చంపి.. అది నక్సల్స్ ఏరివేత అని చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అసలు వాళ్లు మావోయిస్టులా లేక సాధారణ పౌరులా అని చర్చకు అక్కడ జోరందుకుంది.