Ananth Ambani-Radhika marchent Wedding Card: అనంత్ అంబనీ, రాధకా మర్చంట్ పెళ్ళికి అయ్యే ఖర్చుతో కొన్ని కుటుంబాలు చాలా ఏళ్ళు బతికేయొచ్చు. మార్చిలో జరిగిన ప్రీ వెడ్డింగ్, మేలో జరిగిన రెండో ప్రీవెడ్డింగ్…ఇంకా పార్టీలు అంటూ ఇప్పటికే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పెళ్ళి పనలు ప్రారంభించేశారు. మొదటగా పెళ్ళికార్డును ఫిక్స్ చేశారు. దీనిని నీతా అంబానీ దేవుని దగ్గర కూడా పెట్టి వచ్చారు. మామూలుగానే అంబానీ ఇంట పళ్ళి అంటే మామూలుగా ఉండు. పద్ద కొడుకు, కూతురు పెళ్ళిళ్ళు కూడా ఘనంగా చేశారు ముఖేష్ అంబానీ ఇప్పుడు చివరి కొడుకు, వాళ్ళ ఇంట్లో ఇదే చివర పెళ్ళి అవడంతో దీనికి ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.
ఇంతకు ముందు కూతురు ఇషా అంబానీ పెళ్ళికి ముఖేష్ అంబానీ 3లక్షలు ఖర్చు పెట్టి శుభలేఖు వేయించారు. ఇప్పుడు అనంత్ అంబానీకి అంతకంటే ఎక్కువే…దానికి రెండు రెట్టు ఎ్కువ ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ కోసం 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు. ఈ కార్డు వీడియో కూడా చాలా వైరల్ అవుతోంది.
అబనీ ఇంట పెళ్ళి అంటే ప్రపంచ నలుమూలల నుంచీ అతిధులు వస్తారు. అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, కుబేరులే అయి ఉంటారు. అందుకే వారికి తగ్గట్టుగానే పెళ్ళి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శుభలేఖను డిజైన్ చేయించారని అంటున్నారు. అనంత్, రాధికాల పెళ్ళి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.
Unboxing the wedding card for Anant Ambani and Radhika Merchant’s world’s costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2
— DealzTrendz (@dealztrendz) June 26, 2024
Also Read:Telangana: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్