Byju’s Vacating Offices : బైజూస్(Byju’s) ఎడ్టెక్ సంస్థ గురించి దాదాపు దేశంలో అందరికీ తెలుసు. దీనిలో ఎంతో మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. అయితే కొన్నాళ్ళగా బైజూస్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. నెల రోజులుగా ఉద్యోగులకు జీతాలు(No Salaries) కూడా పూర్తిగా చెల్లించలేకపోతోంది. ఇప్పుడు ఈ కష్టాలు మరింత తీవ్ర తరం అయ్యాయి. ఆర్ధి కష్టాలతో సతమతమవుతున్న బైజూస్ దేశంలో తమ ఆఫీసులకు చెల్లించే అద్దెలను భరించలేకపోతోందతి. అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ మూసేయాలని నిర్ణయించుకుంది. 15 వేల మంది ఉద్యోగులను ఇంటి నుంచే పూర్తిగా పని చేయాలని చెప్పినట్టు సమాచారం. అయితే బెంగళూరు(Bangalore) లో ఉన్న ప్రధాన కార్యాలయం మాత్రం పని చేస్తుందని బైజూస్ స్పష్టం చేసింది.
క్రమంగా ఆఫీసులు ఖాళీ…
ఆఫీసులను ఒక్కసారిగా ఖాళీ చేయించడం లేదని.. కొంతకాలంగా అద్దెలు కట్టలేక బైజూస్ తన ఆఫీసులన్నింటినీ క్రమంగా కాళీ చేయిస్తోందని తెలుస్తోంది, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే విద్యార్ధులకు చెప్పే పాఠాలు మాత్రం ఆగవని బైజూస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్ధులకు కేటాయించిన టూషన్ సెంటర్లు మాత్రం యధావిధిగా పని చేస్తాయని తెలిపారు.
నిధుల కొరతతో సతమతం..
గత కొన్ని నెలలుగా బైజూస్ సంస్థ నిధుల కొరత ఎదుర్కొంటోంది. సుమారుగా 1.2 బిలియన్ డాలర్ల లోన్ విషయంలో ఈ సంస్థ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. దాంతో పాటూ కంపెనీ ఆర్ధిక పరిస్థితి దిగజారడంతో ఇన్వెస్టర్లు తమ వాటాలను వెనక్కు తీసేసుకుంటున్నారు. బైజూస్ సీఈవో రవీంద్రన్(Byju’s CEO Ravindran) ను తొలగించాలని వాటాదారులు డిమాండ్ కూడా చేస్తున్నారు. మరోవైపు రవీంద్రన్ దేశం విడిచి వెళ్ళకూడదని ఈడీ ఆంక్షలు కూడా విధించింది.
Also Read : Kerala : మా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయము..కేరళ సీఎం సంచలన ప్రకటన