Bathukamma Viral Video: తెలంగాణ ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి.. తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంతో ఇష్టమైన పూల ఈ పండగను 9 రోజులు సంబరంగా జరుపుకుంటారు. తెలంగా ప్రజలు ఏ దేశంలో ఉన్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా.. అత్యంత వైభవంగా జరుపుకునే పండగ ఈ బతుకమ్మ. తాజాగా అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అయితే.. ఈ వేడుకల్లో అమెరికన్లు కూడా పాల్గొని సందడి చేయడం విశేషం. అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్(Ken Buck) తెలుగు ప్రజలతో కలిసి బతుకమ్మ పాటకు ఆడి పాడారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అమెరికా ప్రతినిధి బతుకమ్మ పాటకు బతుకమ్మ ఆడిన వీడియో చూసిన చాలా మంది విదేశాల్లో కూడా తెలుగు సంస్కృతిని గౌరవించడం గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర దేశస్తుల సంస్కృతిని గౌరవించిన ఆ ప్రజా ప్రతినిధిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
బతుకమ్మ పాటకు అమెరికన్లు ఫిదా
బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు pic.twitter.com/5X2zNnRu0H
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2023
Also Read: Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పండగే.. శంకర్ దాదా M.B.B.S. రీ రిలీజ్..!