Donald Trump Tells NYP After Assassination Attempt : అమెరికా (America) మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ర్యాలీలో భాగంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ చెవికి గాయమైంది. కొంచెం తేడా జరిగి ఉంటే ట్రంప్ ప్రాణాలకే ముప్పు ఉండేది. అయితే ఈ ఘటన జరిగిన అనతంరం దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ దాడిలో తాను చనిపోయాననే అనుకున్నానంటూ తెలిపారు.
Also read: మరోసారి తడబడ్డ జో బైడెన్.. నోరెళ్లబెట్టిన డెమోక్రట్లు
ఓ వార్తతో సంస్థతో మాట్లాడిన ట్రంప్.. ‘ అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నాను. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని’ అన్నారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ట్రంప్‌కు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. అధ్యక్ష రేసు కూడా ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్‌కు బుల్లెట్ తాకిన తర్వాత ట్రంప్ కిందకు వంగారు. ఆ తర్వాత పైకి లేచి పిడికిలి బిగించి ఫైట్, ఫైట్ అంటూ నినాదాలు చేసిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. ఇలాంటి వారే అమెరికాకు అధ్యక్షులు కావాలని రిపబ్లికన్లు (Republicans) ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు ట్రంప్ వ్యతిరేకులు.. కుట్ర సిద్ధాంతాలకు తెర తీశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇగంతా సానుభూతి కోసం చేశారని.. ఇలాంటి వారిని నమ్మలేమని అంటున్నారు. అయితే ట్రంప్ ముఖంపై రక్తం, పిడికిలి బిగించి ఎత్తిన చేయి, వెనుక అమెరికా జెండా ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతోంది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది నవంబర్‌లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ట్రంప్‌పై దాడి జరిగాక ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
Also read: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!