AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొదటి రోజే 99 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన పెన్షన్ పై రూ.1,000 పెంచి రూ.4,000 అందిస్తోంది చంద్రబాబు సర్కార్. కాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలి సీఎం చంద్రబాబు ఆదేశలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు..
నెల్లూరు 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఫించన్లు అందజేశారు మంత్రి పొంగూరు నారాయణ. ఆప్యాయంగా పలకరించి రూ. 4వేల ఫించను నగదును అందజేశారు. అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నా అని అన్నారు మంత్రి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే…రూ. 4వేల పెన్షన్ని మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని కొనియాడారు.
Also Read : పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే!