Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలెబ్రెటీలు వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అదే సమయంలో కొంత మంది పెళ్లి చేసుకొని కొంత కాలానికి విడిపోయిన వారు కూడా ఉన్నారు. అలా విడిపోయిన వారు తిరిగి మరోసారి పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండవ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రెటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము..
నాగచైతన్య
హీరో నాగచైతన్య, నటి సమంత 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు ప్రకటించింది ఈ జంట. గత కొంత కాలంగా నటి శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్న నాగచైతన్య నేడు ఆమెను నిశ్చితార్థం చేసుకున్నారు. నాగచైతన్య శోభిత దూళిపాళ్లను రెండవ వివాహం చేసుకోబోతున్నారు.
అక్కినేని నాగార్జున
అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వేంకేటేష్ చెల్లెలు లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు.
మోహన్ బాబు
సీనియర్ హీరో మోహన్ బాబుకు మొదటగా శ్రీ విద్యా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం మంచు లక్ష్మి, విష్ణు. ఆ తర్వాత కొన్ని కారణాలతో మొదటి భార్య మరణించడంతో.. ఆమె సోదరిని రెండవ వివాహం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మొదటగా నందినితో పెళ్లయింది. కొన్ని విభేదాల కారణంగా ఆమెతో విడిపోయిన పవన్ కళ్యాణ్ నటి రేణుదేశాయ్ ని రెండో వివాహం చేసుకున్నారు.
నందమూరి తారక రామారావు
సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మొదటగా బసవతారకం అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు బసవతారకం క్యాన్సర్ తో మరణించించారు. భార్య చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఒత్తిడి, ఒంటరితనం అనుభవిస్తున్న సమయంలో లక్ష్మీపార్వతికి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు.
మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన రెండు సంవత్సరాల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ రాజకీయ ప్రముఖుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం ఇందిరాదేవిని చేసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు సంతానం. ఆ తర్వాత మళ్ళీ నటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
నరేష్
సూపర్ కృష్ణ రెండవ భార్య విజయ నిర్మల తనయుడు యాక్టర్ నరేష్ మొదట రేఖ సుప్రియను పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల చేత ఆమెతో విడిపోయిన నరేష్ నటి పవిత్రను రెండవ వివాహం చేసుకున్నారు.
Also Read: అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ నిశ్చితార్థం-live – Rtvlive.com