Anna Lezhneva : శ్రీవారి సుప్రభాత సేవలో అన్నా లెజినోవా

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. రాత్రి గాయత్రీ నిలయంలో బసచేసిన ఆమె ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

New Update
Anna Lezhneva at Tirumala

Anna Lezhneva at Tirumala

Anna Lezhneva : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి బయటపడటంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా గాయత్రీ నిలయంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అనంతరం కల్యాణకట్టకు చేరుకున్న ఆమె తలనీలాలు సమర్పించారు. రాత్రి గాయత్రీ నిలయంలో బసచేసిన ఆమె ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి  శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

 దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.  

స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన శ్రీమతి అన్నా కొణిదల 

స్వామి వారి దర్శనానంతరం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమతి అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.  అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు.  

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.   క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో, హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్ పై సంతకం చేశారు.  అనంతరం ఆమె గాయత్రీ నిలయంలో ఆదివారం రాత్రి బస చేశారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

పవన్ కళ్యాణ్, లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటన  సమయంలో విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ హుటాహుటిన సింగపూర్‌ వెళ్లారు. ఆయనతో పాటు సోదరుడు చిరంజీవి, ఆయన సతిమణి సురేఖ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం పవన్‌ దంపతులు హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే తన కుమారుడు క్షేమంగా బయటపడడంతో పవన్‌ భార్య లెజినోవా ఆదివారం తిరుమల తిరుపతి దైవదర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించారు. ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. 

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు