బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదంటోంది. తాను స్టార్ కిడ్ అయినప్పటికీ ఎవరూ లెక్క చేయలేదని, పబ్లిక్ ఫిగర్ అని ఊహించుకున్న తన కలలు తలకిందులయ్యాయని చెప్పింది. అంతేకాదు అభిమానులు తనను ఎందుకు ప్రేమించలేదో అర్థం కాలేదని వాపోయింది. త్వరలోనే ‘ఖో గయే హమ్ కహాన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె కెరీర్ అనుభాల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ మేరకు కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లోనూ నా ఫర్మార్మెన్స్ తో అందరినీ అలరించాను. కానీ నా కెరీర్ ప్రారంభ రోజులు ఆందోళన కలిగించాయి. ఫ్లాష్‌బ్యాక్ గుర్తొస్తే ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే నా తల్లిదండ్రుల వారసత్వంతో వచ్చినందుకు నాకు గొప్ప గుర్తింపు దక్కుంతుందని భావించాను. కానీ నేను ఊహించినదానికంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చుంకీ పాండే నుంచి వచ్చిన వారసత్వంతో గౌరవం పొందాలనుకున్నా. కానీ ఫ్యాన్స్ నన్ను ప్రేమించట్లేదని తెలిసి ఆందోళన చెందాను. ప్రజలను సంతోషపెట్టలేకపోతున్నానని ఒత్తిడికి లోనయ్యాను. అందరూ నన్ను ప్రేమించాలని కోరుకున్నప్పటికీ నా కలలు తలకిందులయ్యాయని వెక్కి వెక్కి ఎడావాలనిపించింది అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : కామారెడ్డిలో మహిళా దొంగల భీభత్సం.. పెప్పర్ స్ప్రేలు, కత్తులతో వచ్చి దోపిడి
పబ్లిక్ ఫిగర్ :
అలాగే తన ఫ్రెండ్స్ అందరూ పబ్లిక్ ఫిగర్ అని చెబుతారన్న నటి.. జనాలు మాత్రం ఎందుకు ప్రేమించలేదో అర్థం కాలేదని వాపోయింది. ఏదిఏమైనా కాలక్రమంలో ఫ్యాన్స్ ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నం చేశానని తెలిపింది. అప్పటినుంచి తన గోల్స్ మార్చుకుని ఏడాదిలోగా ఒక గొప్ప వ్యక్తిగా పరిణామం చెందినట్లు చెప్పింది. నా ప్రవర్తన, నటన ప్రాధాన్యతలను మార్చుకున్నా అంటూ అనన్య వెల్లడించింది. ఇదిలావుంటే ప్రస్తుతం అనన్యాపాండే.. నటుడు ఆదిత్యరాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ‘ఖో గయే హమ్ కహాన్’ సినిమాను అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించగా సిద్ధాంత్ చతుర్వేది , అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైగర్ బేబీబ్యానర్లపై రితేష్ సిధ్వాని, జోయా అక్తర్, రీమా కగ్తి, ఫర్హాన్ అక్తర్‌లు సినిమాను నిర్మించగా 2023 డిసెంబర్ 26 ప్రేక్షకుల ముందుకురానుంది.