Unstoppable With NBK Season 4 : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరించే అద్భుతమైన టాక్‌షో అన్‌స్టాపబుల్ (Unstoppable) విత్ ఎన్బీకే సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి మూడు సీజన్లు అద్భుతమైన విజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది.
అన్‌స్టాపబుల్ 4 ఎప్పుడంటే..
తాజా సమాచారం ప్రకారం, అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా ఈ షోను ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : పెళ్లి రోజు రానా భార్య ఎమోషనల్ పోస్ట్.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటూ!
ఎక్కడ చూడాలి…
అన్‌స్టాపబుల్ సీజన్ 4 కూడా ముందు సీజన్ల మాదిరిగానే ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా’ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఈ షోను ఆస్వాదించవచ్చు. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునేవారి కోసం ఆహా పలు ఆఫర్స్ సైతం అందుబాటులోకి తీసుకురానుంది.
ఎవరు వస్తారు?
ప్రతి సీజన్లోనూ అగ్ర తారలను అతిథులుగా పిలిచే బాలయ్య ఈ సీజన్లో కూడా ఎవరిని పిలుస్తారో అనే దానిపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 4 లో టాలీవుడ్ (Tollywood) స్టార్స్ తో పాటూ బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు పాల్గొంటారని అంటున్నారు. త్వరలోనే సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు వచ్చే గెస్ట్ ను ‘ఆహా’ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది.