Nuvve Kavali Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం ‘నువ్వే కావాలి’. తరుణ్ కెరీర్లో మలుపు తిప్పిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్గా నిలిచింది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించగా, కోటి సంగీతం సినిమాకు ప్రాణం పోశాడు.
తరుణ్, రిచా పల్లాడ్, సాయి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2000లో విడుదలై సంచలనం సృష్టించింది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఓ హీరో మిస్ చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా? అతను మరెవరో కాదు అక్కినేని హీరోల్లో ఒకడైన సుమంత్..
Also Read : కాబోయే కోడలు శోభితపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. అందరి ముందే అలా అనేశాడేంటి!
టాలీవుడ్ లో సత్యం’, ‘గౌరి’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ కెరీర్లో తన వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా ‘నువ్వేకావాలి’ అని పేర్కొన్నాడు.” నా కెరీర్ అప్పుడే మొదలు పెట్టా.
సవ్రంతి రవికిషోర్గారు నాకు ‘నువ్వే కావాలి’ ఆఫర్ ఇచ్చారు. అది డేట్స్ కారణంగా చేయలేకపోయా. అప్పుడు నేను ‘యువకుడు’, ‘పెళ్లి సంబంధం’ రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నా. అందుకే ‘నువ్వేకావాలి’ చేయడం కుదరలేదు. నా సినీ కెరీర్లో అవకాశం వచ్చినా, చేయలేకపోయిన సినిమా అదొక్కటే” అని చెప్పుకొచ్చాడు.