Actor Sumanth: సెలెబ్రెటీలకు సంబంధించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల పెళ్ళి వార్తలు మరింత వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో అక్కినేని హీరో సుమంత్, యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరికి కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడం ఈ పుకార్లకు తెరలేపింది.
"Brotherhood or Buzz? Netizens Cross the Line as Mrunal's 'Anna' Moment with Sumanth Sparks Unwarranted Speculation"#MrunalThakur#SumanthAkkinenipic.twitter.com/4XttDuYW7S
— Filmyscoops (@Filmyscoopss) May 6, 2025
పెళ్లి పై సుమంత్ క్లారిటీ
అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు హీరో సుమంత్. ఇటీవలే తన కొత్త చిత్రం 'అనగనగా' ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి వార్తలపై స్పందించారు. మృణాల్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా తాను ఎక్కువ ఫాలో అవకపోవడంతో.. ఈ వార్తలు తన దృష్టిని రాలేదని తెలిపారు. 'సీతారామం' ప్రమోషన్స్ సమయంలో మృణాల్, తాను ఆ ఫొటో తీసుకున్నామని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే హీరో సుమంత్ గతంలోనే.. నటి కీర్తి రెడ్డితో వివాహం జరిగింది. కానీ పెళ్ళైన కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు.
telugu-news | cinema-news | actor-sumanth | mrunal-thakur | Sumanth- mriunal marriage rumors