Pooja Hegde Intresting Comments On Telugu Cinema : ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే చాలా తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకం అని అంటోంది. ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే.. తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది.
ఐడెంటిటీని ఇచ్చింది…
తాజాగా ఫ్యాన్స్ తో పూజ హెగ్డే చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ అభిమాని అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకిస్తారు? అనడిగితే.. ‘నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. అందుకే తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్.
Also Read : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?
నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా’ అని చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ సూర్య సరసన ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది.