T20 World Cup 2024 : బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ T20 ప్రపంచ కప్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్ పంచింది. బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది By KVD Varma 11 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి South Africa : T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) లో బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేయడం కష్టంగా మారుతోంది. అయితే ప్రతి మ్యాచ్ ఉత్సాహంగా.. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతూ క్రికెట్ అభిమానులకు టీ20 మజా రుచి చూపిస్తోంది. న్యూయార్క్ (New York) లో జరిగిన మ్యాచ్‌లో సోమవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 21వ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్‌కు 11 పరుగులు అవసరం కాగా, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను మేజిక్ చేసి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో కేశవ్ మహరాజ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు కూడా సూపర్-8 రౌండ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. T20 World Cup 2024 : నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ను 4 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గెలుపే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. చివర్లో సొంత తప్పిదాల వల్లే మ్యాచ్‌లో ఓడిపోయింది. చివరి ఓవర్ థ్రిల్ చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్‌కు 11 పరుగులు మాత్రమే కావాలి. కానీ కేశవ్ మహారాజ్ న్యూయార్క్ పిచ్‌పై అలా జరగడానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మహరాజ్ తొలి బంతిని వైడ్‌గా వేశాడు. దీని తర్వాత, అతను వేసిన మొదటి బంతికి మహ్దుల్లా ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. రెండో బంతికి జకీర్ అలీ రెండు పరుగులు చేశాడు. మూడో బంతికి జాకీర్ అలీ.. లాంగ్ ఆన్ ఏరియాలో మర్‌క్రామ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్‌అయ్యాడు. మహరాజ్ వేసిన నాలుగో బంతికి రిషద్ హుస్సేన్ ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. ఐదో బంతికి బంగ్లాదేశ్‌కు 6 పరుగులు అవసరం కాగా, లాంగ్ ఓవర్‌లో మహ్మదుల్లా లాంగ్ షాట్ ఆడాడు, అయితే బౌండరీ వద్ద కెప్టెన్ మార్క్‌రామ్ అద్భుతమైన క్యాచ్‌ని అందుకొని మహ్మదుల్లాను ఔట్ చేశాడు. మార్క్రామ్ ఆరో బంతికి ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. Also Read: పాక్ ఓటమికి అతడే కారణం.. మాలిక్, అఫ్రిదిలు సంచలన వ్యాఖ్యలు! క్లాసెన్ క్లాసిక్.. 44 బంతుల్లో 46 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ సౌతాఫ్రికా విజయానికి హీరో అయ్యాడు. క్లాసెన్ తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. అతని బ్యాటింగ్ కారణంగా దక్షిణాఫ్రికా 113 పరుగులకు చేరుకోగలిగింది. అనంతరం బౌలింగ్‌లో కగిసో రబాడ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఎన్రిక్ నార్కియా కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 🇿🇦 win a thriller in New York 🔥 A skilful bowling display against Bangladesh helps them defend the lowest total in Men's #T20WorldCup history 👏#T20WorldCup | #SAvBAN | 📝: https://t.co/XCZhIYVOHi pic.twitter.com/Kak9T5Jq0S — ICC (@ICC) June 10, 2024 బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే.. T20 World Cup 2024: 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. తౌహిద్ హర్దోయ్ 34 బంతుల్లో 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మహ్మదుల్లా 20 పరుగులు చేశాడు, అయితే అతని జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్ పెద్దగా సహకారం అందించలేకపోయారు. లిటన్ దాస్ 9, షకీబ్ అల్ హసన్ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ శాంటో 14 పరుగుల సహకారం అందించాడు. బౌలింగ్ లో తంజిమ్ హసన్ షకీబ్ 3 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. #t20-world-cup-2024 #cricket #bangladesh #south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి