Team India : భారతీయులకు క్రికెట్ అంటే పిచ్చి.. అయితే ఇందులోనూ వివక్ష ఉంటుంది. ఇండియన్స్ సాధారణంగా బ్యాటింగ్‌ను ఇష్టపడతారు. అందుకే బౌలర్లకు ఫ్యాన్ బేస్ కూడా చాలా అరుదుగా ఉంటుంది. సెంచరీలు బాదినవాడు హీరోలగా కీర్తించపడతారు కానీ వికెట్లు తీసినవాడిని ఆ కాసేపు పొగిడేసి తర్వాత పెద్దగా పట్టించుకోరు. అందుకే టీమిండియా అభిమానులకు ధోనీ (Dhoni) ఓ హీరో కానీ.. ఆ ధోనీ 2011 వరల్డ్ కప్ గెలవడానికి కారణమైన జహీర్‌ఖాన్‌కు కనీసం క్రెడిట్లు కూడా ఇవ్వరు. ఇలాంటి మైండ్‌సెట్ మొదటి నుంచి ఉన్నదే అయినా ఆ ఆలోచనా తీరు ఇప్పటికైనా అవకాశం టీమిండియా ఫ్యాన్స్‌కు వచ్చింది. టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup 2024) ను టీమిండియా గెలుచుకోవడానికి అందరికంటే పెద్ద కారణం పేసర్ జస్ప్రిత్ బుమ్రా. అందుకే అతనికే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
పూర్తిగా చదవండి..Jasprit Bumrah : కోహ్లీ కాదు, రోహిత్ కాదు.. టీమిండియా టాప్ హీరో బుమ్రానే.. ఎలాగంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో తెలివైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు బుమ్రా. డెత్ ఓవర్లలో అదిరే బౌలింగ్‌తో సౌతాఫ్రికాను నిలువరించాడు. అటు టోర్ని మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
Translate this News: