Kishan Reddy: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందనేది అసత్య ప్రచారమని.. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులు ఇస్తామన్నారు.

Kishan Reddy: రేవంత్ రెడ్డికి ఆ శక్తి లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

T-BJP Chief Kishan Reddy: తెలంగాణలో డబుల్‌ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నది అసత్య ప్రచారం అని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కిషన్ రెడ్డి.

ALSO READ: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ

తెలంగాణకు గత పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చిందో చెప్పేందుకు తాము చర్చకు సిద్ధం అని అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. అక్కడి ఐరన్‌ఓర్‌ స్టీల్ ఉత్పత్తికి సరిపోదని అన్నారు. అలాగే ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను బీజేపీ అమ్మాలని చూస్తోందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు ఇస్తాం అని హామీ ఇచ్చారు. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.

#kishan-reddy #kaleshwaram-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe